TSK

TSK · యెషయా 13:21

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

“నేను దాన్ని గుడ్లగూబల స్వాధీనం చేస్తాను. దాన్ని నీటి మడుగులుగా చేస్తాను. నాశనం అనే చీపురుకట్టతో దాన్ని తుడిచి పెట్టేస్తాను.” ఇది సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ప్రకటన.

గూడబాతులు, అడవి మృగాలు దాన్ని ఆక్రమించుకుంటాయి. గుడ్లగూబలు, కాకులు అందులో నివసిస్తాయి. ఆయన నాశనం అనే కొలనూలును చాపుతాడు. వినాశనం అనే ఒడంబాన్ని చేత పట్టుకుంటాడు.

క్రూర జంతువులు, హైనాలు అక్కడ కలిసి తిరుగుతాయి. అడవిమేకలు ఒకదానిపై ఒకటి అరుస్తూ ఉంటాయి. అక్కడ చీకటి పక్షులు నివాసముంటాయి.

¶ అతడు గొప్ప స్వరంతో బిగ్గరగా ఇలా అన్నాడు. “బబులోను నాశనమైంది! బబులోను నాశనమైంది! అది దయ్యాలకు నివాసమైంది. ప్రతి అపవిత్రాత్మకూ ఉనికిపట్టు అయింది. అపవిత్రమూ అసహ్యమూ అయిన ప్రతి పక్షికీ గూడు అయింది.