TSK

TSK · యెషయా 63:12

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని రెండు పాయలుగా చెయ్యి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సముద్రం మధ్యలో ఆరిన పొడి నేల మీద నడిచి వెళ్తారు.

యెహోవా, నీ కుడి చెయ్యి బలిష్ఠమైనది. యెహోవా, నీ కుడిచెయ్యి శత్రువుని అణిచి వేస్తుంది.

భయ భీతులు వారిని ఆవరిస్తాయి. యెహోవా, నీ ప్రజలు అవతలి తీరం చేరే వరకూ నీ హస్తబలం చేత శత్రువులు రాళ్ళ వలే కదలకుండా నిలిచిపోతారు.

నీ గొప్ప పేరును గురించి, నీ బాహుబలం గురించి, నీవు ఎత్తిన నీ చేతి శక్తిని గురించి వింటారు. వారు వచ్చి ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేస్తే

¶ నువ్వు ఎన్నుకున్న నీ ప్రజలు చూస్తుండగా సముద్రాన్ని రెండు పాయలుగా చేసినందున వారు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచారు. లోతైన నీళ్ళలో రాయి వేసినట్టు వారిని వెంటాడిన వాళ్ళను లోతైన సముద్రంలో ముంచివేశావు.

ఇశ్రాయేలు కాపరీ! మందలాగా యోసేపును నడిపించేవాడా, విను. కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా, మా మీద ప్రకాశించు.

ఎర్రసముద్రం రెండు పాయలుగా చీలిపోయేలా చేశాడు. ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది.

నీ లోతైన సముద్రాలను ‘ఎండిపో’ అని చెప్పి వాటిని ఇంకిపోయేలా చేసేది నేనే.

నువ్వు ఐగుప్తు దేశంలో చేసినట్టు ఈరోజు వరకూ ఇశ్రాయేలు వాళ్ళ మధ్య, ఇతర మనుషుల మధ్య సూచక క్రియలు, గొప్ప కార్యాలు చేస్తూ నీ పేరు ప్రసిద్ధి చేసుకున్నావు.

¶ దేవుని వాక్కు ఫరోతో చెప్పిందేమంటే, “నేను నీలో నా బలాన్ని ప్రదర్శించాలి, నా పేరు భూలోకమంతా ప్రచురం కావాలి. ఈ ఉద్దేశం కోసమే నిన్ను హెచ్చించాను.”