TSK

TSK · యిర్మీయా 13:9

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ఆడంబర మహాత్మ్యాలతో నిన్ను నువ్వు అలంకరించుకో. గౌరవప్రభావాలు ధరించుకో.

యెహోవా భీకర సన్నిధి నుంచి, ఘనత కలిగిన ఆయన మహిమ నుంచీ వెళ్లి గండ శిలల్లో, నేలలో దాగి ఉండు.

మోయాబు గర్వం గురించి మేము విన్నాం. అతని అహంకారం, అతని ప్రగల్భాలు, అతని క్రోధం గురించి విన్నాం. కానీ అతని ప్రగల్భాలు వట్టివి.

జాగ్రత్తగా వినండి. యెహోవా మాట్లాడుతున్నాడు, అహంకారం వద్దు.

వాళ్ళు ఈ రోజు ఉన్నట్టుగా అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉండడానికి యెరూషలేముకూ యూదా పట్టణాలకూ దాని గొప్ప రాజులకూ దాని అధిపతులకూ తాగించాను.

¶ నీ చుట్టూ ఉండి నిన్ను తృణీకరించిన ఫిలిష్తీయుల కూతుళ్ళూ, సిరియా కూతుళ్ళూ నిన్ను అవమానపరిచినప్పుడు

¶ ఆ దినాన నీ గర్వాన్ని బట్టి సంతోషించే వారిని నీలో నుండి నేను వెళ్లగొడతాను. కాబట్టి నా పరిశుద్ధమైన కొండ దగ్గర నీవిక అహంకారం చూపించవు. నా మీద తిరగబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలగదు.

కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.