TSK

TSK · యిర్మీయా 8:13

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ద్రాక్షతోటలను మీరు నాటి, వాటి బాగోగులు చూసుకుంటారు కానీ ఆ ద్రాక్షారసాన్ని తాగరు. ద్రాక్ష పండ్లు కొయ్యరు. ఎందుకంటే పురుగులు వాటిని తినేస్తాయి.

నేను నా ద్రాక్షతోటకు చేసిన దానికంటే మరి ఇంకా ఏమి చేయగలను? అది ద్రాక్షపండ్లు కాస్తుందని నేను ఎదురు చూస్తే అది పిచ్చి ద్రాక్షలు ఎందుకు కాసింది?

ఆ దినాన యెహోవా ఉన్నత స్థలాల్లోని ఉన్నత స్థల సమూహాన్ని, భూమి మీద ఉన్న భూరాజులను దండిస్తాడు.

¶ అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ ఈ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ఆ ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.”

¶ కాబట్టి ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “మీరందరూ పనికిరాని చెత్తలా ఉన్నారు గనుక, చూడండి, యెరూషలేము మధ్యకు మిమ్మల్ని పోగు చేస్తాను. ఒకడు వెండి, ఇత్తడి, ఇనుము, సీసం, తగరం పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్టు,

¶ తిరుగుబాటుచేసే ఈ ప్రజలకు ఉపమాన రీతిగా ఒక సామెత చెప్పు, ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, వంట కుండ తెచ్చి అందులో నీళ్లు పోసి దాన్ని పొయ్యి మీద పెట్టు.

అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు. నా అంజూరపు చెట్టును ఒలిచి వేశాడు. దాని బెరడు ఒలిచి పారేశాడు. వాటి కొమ్మలు తెల్లబారాయి.

¶ అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా, ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా, ఒలీవచెట్లు కాపులేక ఉన్నా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా,

¶ తెగులుతోను, కాటుకతోను, వడగండ్లతోను, మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేశాను. అయినా మీలో ఒక్కడు కూడా తిరిగి నా దగ్గరికి రాలేదు. ఇదే యెహోవా వాక్కు.

అప్పుడు ఆ దారి పక్కన ఒక అంజూరు చెట్టును చూశాడు. ఆయన దాని దగ్గరికి వెళ్ళి చూస్తే, దానికి ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. ఆయన దానితో, ‹“ఇక ముందు నీవు ఎప్పటికీ కాపు కాయవు!”› అన్నాడు. వెంటనే ఆ అంజూరు చెట్టు ఎండిపోయింది.

¶ సూర్యుడు ఉదయించిన తరువాత మండే ఎండకు మొక్క ఎండిపోతుంది. పువ్వు రాలిపోతుంది. దాని అందం అంతా పోతుంది. అదేవిధంగా ధనవంతులు కూడా తమ కార్యకలాపాల్లో ఉండగానే వాడిపోతారు.