TSK

TSK · యోబు 21:28

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

అతడు “ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి” అని ఆ సమాజంతో అన్నాడు.

నీపై పగ పెంచుకునే వాళ్ళు అవమానం పాలవుతారు. దుష్టుల గుడారాలు లేకుండా పోతాయి.

అయితే వాళ్ళ మలం లాగా వాళ్ళు ఎప్పటికీ కనబడకుండా కనుమరుగైపోతారు. అంతకు ముందు వాళ్ళను చూసిన వాళ్ళు “వాళ్ళంతా ఏమయ్యారు?” అని అడుగుతారు.

నేను వేసిన అడుగుల లెక్క ఆయనకు తెలియజేస్తాను. రాజు లాగా నిబ్బరంగా నేనాయన దగ్గరికి వెళ్తాను.

కాబట్టి దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను నీ గుడారంలో నుండి పెరికి వేస్తాడు. సజీవులుండే ప్రాంతం నుండి నిన్ను పెల్లగిస్తాడు.

¶ ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. నేనే ఆ గ్రంథాన్ని పంపుతున్నాను. అది దొంగల ఇళ్ళలో, నా నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేసేవారి ఇళ్ళలో ప్రవేశించి వాళ్ళ ఇళ్ళలో ఉండి ఇళ్ళను, వాటి గుమ్మాలను, గోడలను నాశనం చేస్తుంది.