TSK

TSK · యోబు 9:6

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉన్నావు? నీకు అంత తెలివి తేటలుంటే చెప్పు.

పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు?

యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి, ఆయన ప్రభావ మహత్యం నుంచి పారిపోయి కొండల గుహల్లో, నేల గుంటల్లో మనుషులు దాగి ఉంటారు.

సైన్యాలకు అధిపతి అయిన యెహోవా కోపాగ్ని కురిసే రోజున, ఆయన ఉగ్రతకు ఆకాశం వణికేలా, భూమి తన స్థానం తప్పేలా నేను చేస్తాను.

భూమి బొత్తిగా బద్దలై పోతున్నది. భూమి కేవలం ముక్కలై పోతున్నది. భూమి బ్రహ్మాండంగా దద్దరిల్లుతున్నది.

¶ వాటి ముందు భూమి కంపిస్తున్నది, ఆకాశాలు వణుకుతున్నాయి. సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి.

¶ “యూదాదేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు. ఆకాశాన్ని, భూమిని నేను కంపింపజేయ బోతున్నాను.

¶ తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు.