హేబెలు కూడా తన మందలో తొలుచూలు పిల్లల్లో కొవ్వు పట్టిన వాటిని తెచ్చాడు. యెహోవా హేబెలును, అతని అర్పణను అంగీకరించాడు.
TSK
TSK · లేవీ 1:10
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ మీరు ఎన్నుకొనే గొర్రె లేదా మేక పిల్ల ఒక సంవత్సరం వయసు గల మగదై ఉండాలి. అది ఎలాంటి లోపం లేకుండా ఉండాలి.
¶ “ఎవరైనా ఒక మంద లోని పశువుల్లో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా అర్పించాలనుకుంటే, అతడు లోపం లేని దాన్ని యెహోవా సన్నిధిలో అర్పించాలి.
తరువాత తాను చేసిన పాపం అతనికి తెలిస్తే అప్పుడు అతడు ఒక మగ మేకని తన అర్పణగా తీసుకురావాలి. అది లోపం లేనిదిగా ఉండాలి.
అహరోనుతో ఇలా అన్నాడు. “పాపం కోసం బలి అర్పణగా మందలో నుండి లోపం లేని ఒక దూడనీ, దహనబలి కోసం లోపం లేని ఒక పొట్టేలునూ యెహోవా సమక్షంలోకి తీసుకు రా.
¶ అతడు పాపం కోసం బలిగా ఒక కోడె దూడనూ, దహనబలిగా ఒక పొట్టేలునూ తీసుకుని పవిత్ర స్థలం లోకి రావాలి.
ఆ అర్పణ దేవుడు అంగీకరించేలా ఆవుల్లో నుండి గానీ, గొర్రె మేకల్లో నుండి గానీ దోషంలేని మగదాన్ని అర్పించాలి.
అతడు తన అర్పణ యెహోవాకు అర్పించాలి. ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఒక మగ గొర్రెపిల్లని దహనబలిగా అర్పించాలి. అలాగే ఒక ఏడాది వయసున్న లోపరహితమైన ఆడ గొర్రెపిల్లను పాపం కోసం చేసే అర్పణగా తీసుకురావాలి. అతడింకా లోపరహితమైన ఒక పొట్టేలును శాంతి బలిగా తీసుకురావాలి.
మనందరం గొర్రెలలాగా దారి తప్పాము. మనలో ప్రతివాడూ తనకిష్టమైన దారికి తొలగిపోయాము. యెహోవా మనందరి దోషాన్ని ఆయనమీద మోపాడు.
¶ మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల!