TSK

TSK · లూకా 1:9

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ అహరోను ఆ వేదికపై పరిమళ ద్రవ్యాల ధూపం వెయ్యాలి. అతడు ప్రతిరోజూ ఉదయం దీపాలను సర్దే సమయంలో దాని మీద ధూపం వెయ్యాలి.

కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు.

¶ అతి పరిశుద్ధ స్థలానికి సంబంధించిన అన్ని పనులూ అహరోనూ, అతని సంతానం చేస్తూ ఉన్నారు. వీళ్ళు దహన బలి అర్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. అలాగే ధూపార్పణని బలిపీఠం పైన అర్పించేవాళ్ళు. ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి ఇదంతా దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లుగా జరిగేది.

¶ అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు.

వీటన్నిటినీ సిద్ధం చేశాక యాజకులు క్రమం తప్పకుండా ప్రత్యక్ష గుడారంలోని వెలుపలి గదిలోకి ప్రవేశించి తమ సేవలు చేస్తారు.