TSK

TSK · మీకా 1:4

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

యెహోవా, నువ్వు శేయీరు నుంచి బయలుదేరినప్పుడు, ఎదోము పొలం నుంచి యుద్ధానికి బయలుదేరినప్పుడు, భూమి కంపించింది. ఆకాశం వణికింది. మేఘాలు నీళ్ళు కుమ్మరించాయి.

లోకనాథుడైన యెహోవా ఎదుట, పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి.

¶ ఆయన సేనల అధిపతి యెహోవా. ఆయన భూమిని తాకితే అది కరిగి పోతుంది. దానిలో జీవించే వారంతా రోదిస్తారు. నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశంలోని నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.

¶ ఆయన నిలబడి భూమిని కొలిచాడు. రాజ్యాలను కంపింప జేశాడు. నిత్య పర్వతాలు బద్దలైపోయాయి. పురాతన గిరులు అణిగి పోయాయి. ఆయన మార్గాలు శాశ్వత మార్గాలు.

ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.

¶ తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు.