అప్పుడు మోషే శిబిరం ద్వారం దగ్గర నిలబడి “యెహోవా పక్షంగా ఉన్నవాళ్ళంతా నా దగ్గరికి రండి” అన్నాడు. లేవీయులంతా అతని దగ్గరికి వచ్చారు.
TSK
TSK · సంఖ్యా 1:50
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.”
¶ యెహోవా సీనాయి కొండపైన మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల సంతానం వివరాలు ఇవి.
గెర్షోనీయుల తెగలు దేవుని మందిరానికి పడమటి దిశగా అంటే వెనుక వైపున గుడారాలు వేసుకోవాలి.
¶ అహరోనూ అతని కొడుకులూ పరిశుద్ధ స్థలాన్నీ, దానికి సంబంధించిన పరికరాలన్నిటినీ సంపూర్ణంగా కప్పిన తరువాత ప్రజలు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు కహాతు వంశస్తులు పరిశుద్ధ స్థలాన్ని మోయడానికి ముందుకు రావాలి. అయితే వారు పరిశుద్ధ పరికరాలను ముట్టుకుంటే చనిపోతారు. సన్నిధి గుడారంలోని పరికరాలను మోసుకు వెళ్ళడం కహతు వంశస్తుల బాధ్యత.
వారిని అహరోనుకీ అతని కొడుకులకీ ఒక బహుమానంగా ఇచ్చాను. సన్నిధి గుడారంలో ఇశ్రాయేలు ప్రజల కోసం పనిచేయడానికి వారిని ఇశ్రాయేలు ప్రజల్లో నుండి తీసుకున్నాను. ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ స్థలాన్ని సమీపించినప్పుడు వాళ్లకి ఎలాంటి తెగులు హాని చేయకుండా వారి కోసం పరిహారం చేయడానికి నేను వీరిని నియమించాను.”
¶ తరువాత లేవీ వారు అహరోను ఎదుటా, అతని కొడుకుల ఎదుటా సన్నిధి గుడారంలో తమ సేవ చేయడానికి వెళ్ళారు. లేవీ వారిని గురించి యెహోవా మోషేకి ఆదేశించిన దాని ప్రకారం ఇది జరిగింది. లేవీ వాళ్లకందరికీ ఇలాగే జరిగించారు.
ఒక బయటి వాడు మీ దగ్గరికి రాకూడదు. ఇకముందు ఇశ్రాయేలీయుల మీదకి నా కోపం రాకుండా ఉండాలంటే మీరు పవిత్రస్థలం పట్ల, బలిపీఠం పట్ల బాధ్యత వహించాలి.
¶ దావీదు సంవత్సరాలు నిండిన వృద్ధుడయ్యాడు. కాబట్టి అతడు తన కొడుకు సొలొమోనును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించాడు.
మన దేవుని ఆలయం నిలబెట్టడానికి దేశపు రాజు, అతని మంత్రులు, అధిపతులు, ఇంకా అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులంతా సమర్పించిన వెండి బంగారాలను, ఇతర సామగ్రిని బరువు తూచి వారికి అప్పగించాను.
¶ లేవీయులలో ఇంకా, యేషూవ, బిన్నూయి, కద్మీయేలు, షేరేబ్యా, యూదా, కృతజ్ఞత పాటలు పాడే పరిచర్యలో ముఖ్యుడైన మత్తన్యా, అతని బంధువులు.
¶ జెరుబ్బాబెలు కాలంలో, నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీయులంతా తమ తమ వంతుల ప్రకారం గాయకులకు, ద్వారపాలకులకు ప్రతిరోజూ ఆహార పదార్థాలను ఇస్తూ వచ్చారు. లేవీయుల కోసం ఒక భాగం కేటాయించారు. లేవీయులు అహరోను వంశంవారి కోసం ఒక భాగం కేటాయించారు.
లేవీయులకు అందాల్సిన వంతులు వాళ్లకు అందకపోవడం వలన ఆలయంలో పరిచర్య చేసే లేవీయులు, గాయకులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారని తెలుసుకున్నాను.
యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోవాలని వారికి శాసనం ఉంది.