TSK

TSK · సంఖ్యా 15:9

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ ఇవి దహనబలిని గూర్చీ, అపరాధం కోసం చేసే బలిని గూర్చీ, నైవేద్య అర్పణ బలిని గూర్చీ, పాపం కోసం చేసే బలిని గూర్చీ, ప్రతిష్టార్పణ బలిని గూర్చీ, శాంతిబలిని గూర్చీ వివరించే చట్టం.

నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో మూడు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క పొట్టేలుతో, నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో రెండు పదోవంతులు నైవేద్యంగా అర్పించాలి. ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలిపిన నాలుగున్నర లీటర్ల పిండిలో ఒక్క పదో వంతు నైవేద్యంగా అర్పించాలి.

అలాగే మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలిగా ఒక మేకపిల్లను అర్పించాలి.

బల్లమీద పెట్టే రొట్టె విషయంలో, నిత్యమూ కొనసాగే నైవేద్యం విషయంలో, దహన బలి విషయంలో, విశ్రాంతి దినం ఆచరించే విషయంలో, అమావాస్యల విషయంలో, నియామక పండగల విషయంలో, ప్రతిష్ట అయిన వస్తువుల విషయంలో, ఇశ్రాయేలీయుల ప్రాయశ్చిత్త పాప పరిహారార్థ బలుల విషయంలో, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలో ఆ విధంగా నడుచుకొంటామని నిర్ణయం తీసుకున్నాం.

పొట్టేలుతో 22 లీటర్ల పిండితో నైవేద్యం చేయాలి. గొర్రెపిల్లలతో తన శక్తికొలది నైవేద్యాన్ని, ప్రతి 22 లీటర్ల పిండికి ఒక లీటర్ నూనె తేవాలి.

¶ పండగ రోజుల్లో, నియమిత సమయాల్లో ఎద్దుతో, పొట్టేలుతో అయితే 22 లీటర్లు పిండి, గొర్రెపిల్లలతో శక్తి మేరకు పిండిని, ప్రతి 22 లీటర్ల పిండితో ఒక లీటర్ నూనె, నైవేద్యంగా అర్పించాలి.

నైవేద్యం, పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండ నిలిచి పోయాయి. యెహోవా సేవకులు, యాజకులు ఏడుస్తున్నారు.