TSK

TSK · సంఖ్యా 22:12

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు.

కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి కూడా ఇక్కడ ఉండండి. యెహోవా నాతో ఇంకేం చెప్తాడో నేను తెలుసుకుంటాను” అన్నాడు.

¶ అప్పుడు బాలాకు అతనితో “దయచేసి నాతోపాటు ఇంకొక చోటికి రా. అక్కడనుంచి వారిని చూడొచ్చు. చివర ఉన్న వారిని మాత్రమే నువ్వు చూడ గలుగుతావు. వారందరూ నీకు కనిపించరు. అక్కడ నుంచి నా కోసం వారిని శపించాలి” అని చెప్పి

¶ యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం పనిచెయ్యదు. ఏ శకునం హాని చెయ్యదు. దానికి బదులుగా యాకోబు గురించీ, ఇశ్రాయేలు గురించీ ‘దేవుడు ఏం చేశాడో చూడు’ అని చెప్పుకోవాలి.

¶ అన్ని ఇతర జాతుల ప్రజలకంటే మీరు ఎక్కువగా ఆశీర్వాదం పొందుతారు. మీలో మగవారికే గాని, ఆడవారికే గాని సంతాన హీనత ఉండదు, మీ పశువుల్లో కూడా ఉండదు.

మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవెనలుంటాయి.

“యెహోవా మందిరంలోకి ప్రజలు కానుకలు తీసుకురావడం మొదలుపెట్టినప్పటి నుంచి మేము సమృద్ధిగా భోజనం చేసినా ఇంకా చాలా మిగిలి పోతున్నది. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించినందుకు ఇంత గొప్పరాశి మిగిలింది.”

ఇలాంటి దీవెనలు గల ప్రజలు ధన్యులు. యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో వాళ్ళు ధన్యజీవులు.

రాజ్యాల్లో వారి సంతతివారు, జాతుల్లో వారి సంతానం పేరు పొందుతారు. వారిని చూసే వారంతా వారు యెహోవా దీవించినవారని ఒప్పుకుంటారు.

¶ అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, “నీవు ఆ నిర్దోషి జోలికి పోవద్దు. ఈ రోజు నేను ఆయన గురించి కలలో బహు బాధపడ్డాను” అని అతనికి కబురు పంపింది.