ఉదయం అర్పించే గొర్రెపిల్లతోబాటు దంచి తీసిన నూనెతో కలిపిన ఒక కిలో పిండిని, పానార్పణగా లీటరు ద్రాక్షరసాన్నీ అర్పించాలి.
TSK
TSK · సంఖ్యా 28:7
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ దాని మీద నిషిద్ధమైన వేరే ధూపాలు వెయ్యకూడదు. హోమాన్ని గానీ, నైవేద్య ద్రవ్యాలను గానీ అర్పించకూడదు. పానార్పణలు అర్పించ కూడదు.
దాని నైవేద్యం నూనెతో కలిసిన పది వంతుల గోదుమపిండి రెండు భాగాలు. అది యెహోవాకు పరిమళ హోమం. దాని పానార్పణం ఒక లీటర్ ద్రాక్షారసం.
ఒక లీటరు ద్రాక్షారసం పానార్పణగా తేవాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసన.
¶ వాటి పానార్పణలు ఒక్కొక్క దున్నపోతుతో ఒక లీటరు ద్రాక్షారసం, పొట్టేలుతో ఒక లీటరు, గొర్రెపిల్లతో ముప్పావు లీటరు ఉండాలి. ఇది సంవత్సరంలో ప్రతినెలా జరగాల్సిన దహనబలి.
లోయలోని రాళ్ళే మీ భాగం. అవే మీ వంతు. వాటికే పానార్పణ పోస్తున్నారు. వాటికే నైవేద్యం అర్పిస్తున్నారు. వీటిలో నేను ఆనందించాలా?
¶ యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి! బలిపీఠం దగ్గర సేవకులారా, ఏడవండి. నా దేవుని సేవకులారా, గోనెసంచి కట్టుకుని రాత్రంతా గడపండి. నైవేద్యం, పానార్పణం, మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయాయి.
¶ మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను.