TSK

TSK · యిర్మీయా 34:21

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు.

నువ్వు అతని చేతిలోనుంచి తప్పించుకోలేవు, కచ్చితంగా నువ్వు అతనికి దొరికిపోతావు, నిన్ను అతని చేతికి అప్పగించడం జరుగుతుంది. బబులోను రాజును నువ్వు నీ కళ్ళతో చూస్తావు. నువ్వు బబులోను వెళ్ళినప్పుడు నువ్వు అతనితో ముఖాముఖి మాట్లాడతావు.’

¶ బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిద్కియా కొడుకులను అతని కళ్ళముందే చంపాడు. అతడు యూదా ప్రధానులందరినీ చంపాడు.

¶ రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు.

“తిరగబడే జాతికి ఇలా చెప్పు. ఈ మాటల భావం మీకు తెలియదా? చూడండి! బబులోనురాజు యెరూషలేముకు వచ్చి ఆమె రాజునూ ఆమె యువరాజులనూ పట్టుకుని వాళ్ళని బబులోనులో తన దగ్గరకి తీసుకు పోయాడు.

నా వల అతనిపై విసురుతున్నాను. అతడు నా ఉచ్చులో చిక్కుకుంటాడు. రాజద్రోహం చేసినందుకూ, నాకు నమ్మకద్రోహం చేసినందుకూ అతనిపై శిక్ష అమలు పరచడానికి అతణ్ణి బబులోనుకి తీసుకు వెళ్తాను.