TSK

TSK · సంఖ్యా 1:32

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

ఇంకా ఆమె “యెహోవా నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడు గాక” అనుకుని అతనికి “యోసేపు” అనే పేరు పెట్టింది.

¶ యోసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు. ఫరో దగ్గర ఉద్యోగి, రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీఫరు అనే ఐగుప్తీయుడు, అతన్ని అక్కడికి తీసుకొచ్చిన ఇష్మాయేలీయుల దగ్గర యోసేపును కొన్నాడు.

¶ ఈ సంగతులైన తరువాత “ఇదిగో, మీ నాన్నకు ఒంట్లో బాగాలేదు” అని ఒకడు యోసేపుతో చెప్పాడు. అప్పుడతడు మనష్షే, ఎఫ్రాయిము అనే తన ఇద్దరు కొడుకులను వెంటబెట్టుకుని వెళ్ళాడు.

యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.

¶ ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు-షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.