TSK

TSK · 2 రాజులు 9:13

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ అబ్షాలోము తన గూఢచారులను పిలిచి “మీరు బూర శబ్దం విన్నప్పుడు, ‘అబ్షాలోము హెబ్రోనులో పరిపాలిస్తున్నాడు’ అని కేకలు వేయాలని అన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారిని సిద్ధపరచండి” అని చెప్పి పంపించాడు.

యాజకుడు సాదోకు, ప్రవక్త నాతాను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరవాత మీరు బాకాలు ఊది, ‘రాజైన సొలొమోను చిరకాలం జీవించాలి’ అని ప్రకటన చేయాలి.

అప్పుడు యెహోయాదా యువ రాజు యోవాషుని బయటకు తీసుకు వచ్చాడు. అతని తలపై కిరీటం పెట్టారు. అతని చేతుల్లో ధర్మశాస్త్ర ప్రతిని ఉంచారు. తరువాత వారు అతనికి పట్టాభిషేకం చేసారు. అంతా చప్పట్లు కొట్టి “రాజు చిరకాలం జీవించాలి” అంటూ నినాదాలు చేశారు.

దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు. బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు.

వారు ఆ గాడిదను, దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు. వాటిమీద ఆయన కూర్చున్నాడు.

ఆయన వెళ్తుంటే దారి పొడుగునా తమ బట్టలు పరిచారు.