¶ మాయోను గ్రామంలో ఒకడున్నాడు. అతని ఆస్తిపాస్తులన్నీ కర్మెలులో ఉన్నాయి. అతడు చాలా ధనవంతుడు, అతనికి మూడువేల గొర్రెలు, వెయ్యి మేకలు ఉన్నాయి. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళాడు.
TSK
TSK · ఆమోసు 1:2
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ రాజు వల్ల కలిగే భయం సింహగర్జన వంటిది. రాజుకు కోపం రేపే వాడు తన ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టుకుంటాడు.
అది బాగా విచ్చుకుని, ఉల్లాసంతో పాటలు పాడుతుంది. దానికి లెబానోను లాంటి అందం కలుగుతుంది. దానికి కర్మెలు షారోనులకున్నంత సొగసు కలుగుతుంది. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూస్తాయి.
దాని ప్రజల చెడుతనం వలన భూమి ఎంతకాలం దుఃఖించాలి? దేశంలో గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవాలి? జంతువులు, పక్షులు అంతరించి పోతున్నాయి. వారేమో “మనకేం జరగబోతున్నదో దేవునికి తెలియదు” అని చెప్పుకుంటున్నారు.
కాబట్టి యిర్మీయా! నువ్వు ఈ మాటలన్నీ వారికి ప్రకటించు. వారికిలా చెప్పు “యెహోవా పైనుంచి గర్జిస్తున్నాడు. తన పవిత్ర నివాసం నుంచి తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. తన నివాస స్థలానికి విరోధంగా గర్జిస్తున్నాడు. దేశంలో నివసిస్తున్న వారందరికీ వ్యతిరేకంగా కేకలు వేస్తున్నాడు. ద్రాక్షగానుగ తొక్కే వారిలాగా అరుస్తున్నాడు.
¶ పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను. ఆడసింహం మింగివేసినట్టు వారిని మింగివేస్తాను. క్రూరమృగాల్లాగా వారిని చీల్చివేస్తాను.
మన కళ్ళముందే ఆహారం, మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా?
¶ యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు. యెరూషలేములోనుంచి తన స్వరం పెంచుతాడు. భూమ్యాకాశాలు కంపిస్తాయి. అయితే యెహోవా తన ప్రజలకు ఆశ్రయం. ఇశ్రాయేలీయులకు కోటగా ఉంటాడు.
సింహం గర్జించింది. భయపడని వాడెవడు? యెహోవా ప్రభువు చెప్పాడు. ప్రవచించని వాడెవడు?
¶ కర్మెలు పర్వత శిఖరాన వాళ్ళు దాక్కున్నా నేను వాళ్ళను వెతికి పట్టుకుంటాను. నా దృష్టికి కనబడకుండా వాళ్ళు సముద్రపు అడుగున దాక్కున్నా వాళ్ళను కాటేయడానికి నేను పాముకు ఆజ్ఞాపిస్తాను. అది వాళ్ళను కాటేస్తుంది.