TSK

TSK · ఆమోసు 8:14

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

యెహోవా, అతని ఆధిపత్యాలను దీవించు, అతడు చేసే పనులను అంగీకరించు. అతనికి విరోధంగా లేచే వారి, అతన్ని ద్వేషించేవారి నడుములు విరగ్గొట్టు. వాళ్ళు మళ్ళీ లేవరు.

ఇశ్రాయేలు ప్రజలారా, ఐగుప్తు దేశంలోనుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుళ్ళు ఇవే” అని చెప్పి, ఆ దూడల్లో ఒకటి బేతేలులో, మరొకటి దానులో ఉంచాడు.

వెనక్కి వచ్చి, నీవు అక్కడ భోజనం చేయొద్దని ఆయన చెప్పిన చోట భోజనం చేశావు కాబట్టి నీ శవాన్ని నీ పూర్వీకుల సమాధులకు చేరదు” అని బిగ్గరగా చెప్పాడు.

అతడు షెమెరు దగ్గర షోమ్రోను కొండను దగ్గరగా 70 కిలోల వెండిని కొనుక్కుని ఆ కొండ మీద ఒక పట్టణాన్ని కట్టించి, ఆ కొండ యజమాని అయిన షెమెరు అనే వాని పేరును బట్టి తాను కట్టించిన పట్టణానికి షోమ్రోను అనే పేరు పెట్టాడు.

అయితే వారు దేవుని రాయబారులను ఎగతాళి చేస్తూ ఆయన మాటలను తృణీకరిస్తూ ఆయన ప్రవక్తలను హింసిస్తూ ఉండటం వల్ల యెహోవా కోపం తీవ్రంగా ఆయన ప్రజల మీదికి వచ్చింది.

కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి. వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి. ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి.

¶ చాలా గద్దింపులు వచ్చినా తలబిరుసుగా ఉండిపోయేవాడు ఇక స్వస్థత అనేది లేకుండా హఠాత్తుగా విరిగి పోతాడు.

నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. “ఇశ్రాయేలు దేవుడు సేనల అధిపతి యెహోవా ఇలా చెబుతున్నాడు, తాగండి! మత్తేక్కే వరకు తాగి, కక్కండి. నేను మీ మీదికి పంపించే కత్తి ఎదుట మళ్ళీ లేవకుండా కూలండి.”

¶ ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైపోయావు. అయినా యూదా ఆ పాపంలో పాలు పొందక పోవుగాక. మీరు గిల్గాలు వెళ్లొద్దు. బేతావెనుకు పోవద్దు. యెహోవా జీవం తోడని ప్రమాణం చేయవద్దు.

¶ బేతావెనులో ఉన్న దూడల విషయమై దాని ప్రజలు భయపడతారు. దాని వైభవం పోయిందని ప్రజలు, సంతోష పడుతూ వచ్చిన దాని అర్చకులు దుఃఖిస్తారు.

¶ షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక, ప్రజలు కత్తివాత కూలుతారు. వారి పిల్లలను రాళ్లకేసి కొడతారు. గర్భవతుల కడుపులు చీరేస్తారు.

ఇశ్రాయేలు కన్య కూలిపోయింది. ఆమె ఇంకా ఎప్పటికీ లేవదు. లేపడానికి ఎవరూ లేక ఆమె తన నేల మీద పడి ఉంది.

¶ ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే. ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం. యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి? అది సమరయ కాదా? యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి? అది యెరూషలేము కాదా?

యేసు మార్గాన్ని అనుసరించే పురుషులు గానీ స్త్రీలు గానీ తనకు దొరికితే, వారిని బంధించి యెరూషలేముకు తీసికొచ్చేలా దమస్కు ఊరి సమాజ మందిరాల వారికి ఉత్తరాలు రాసి ఇమ్మని అడిగాడు.

అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.

¶ అయితే ఒక సంగతి మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాసి ఉన్నవన్నీ నమ్మి,