TSK

TSK · దానియేలు 5:19

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

¶ అతనితో దయగా మాట్లాడి, అతని పీఠాన్ని బబులోనులో తన దగ్గరున్న రాజుల పీఠాలకన్నా ఎత్తు చేశాడు.

రాజు సన్నిధి నుండి హడావుడిగా బయటికి వెళ్లకు. అతడు అనుకున్న దానంతటినీ జరిగించగలడు కాబట్టి చెడు కార్యాల్లో పాలు పుచ్చుకోకు.

¶ ‘నా గొప్ప బలంతో చాచిన చేతితో భూమిని చేశాను. భూమి మీద ఉన్న మట్టినీ జంతువులనూ నేనే చేశాను. వాటిని నా దృష్టిలో ఎవరు సరిగా ఉన్నారో వారికే ఇస్తాను.

¶ ఆ సమయంలో రాజ ప్రతినిధి ఒకడు ఇలా ప్రకటించాడు. “సమస్త ప్రజలారా, దేశస్థులారా, వివిధ భాషలు మాట్లాడేవారలారా, మీకు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే,

తన సైన్యంలో ఉన్న బలిష్ఠులైన కొందరిని పిలిపించాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి మండుతున్న ఆ గుండంలో పడవేయమని ఆజ్ఞ ఇచ్చాడు.

¶ బెల్తెషాజరు అనే పేరున్న దానియేలు ఒక గంట సేపు ఎంతో ఆశ్చర్యానికి లోనై తన మనస్సులో తీవ్రమైన కలవరం చెందాడు. అప్పుడు రాజు “బెల్తెషాజర్, ఈ దర్శనం గురించి గానీ, దాని భావం గురించి గానీ నువ్వు కంగారు పడవద్దు” అన్నాడు. బెల్తెషాజర్ జవాబిస్తూ “ప్రభూ, ఇలాంటి దర్శనం, దాని భావం మీ శత్రువులకు, మిమ్మల్ని ద్వేషించే వాళ్లకు వచ్చి ఉంటే సమంజసంగా ఉండేది.”

ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందుకు దక్షిణదేశం రాజు మనస్సులో గర్విస్తాడు. వేలకొలది శత్రు సైనికులను హతం చేసినా అతనికి జయం కలగదు.

¶ యేసు జవాబిస్తూ, ‹“నీకు ఆ అధికారం పైనుంచి వస్తే తప్ప నా మీద నీకు ఏ అధికారం ఉండదు. కాబట్టి నన్ను నీకు అప్పగించిన వాడికి ఎక్కువ పాపం ఉంది”› అన్నాడు.