జనాల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి కత్తి దూసి మీ వెంటబడి తరుముతాను. మీ దేశం పాడైపోతుంది, మీ ఊళ్లు పాడుబడిపోతాయి.
TSK
TSK · దానియేలు 9:7
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
ఆయన మనకు ఆశ్రయ దుర్గం. ఆయన పని పరిపూర్ణం. ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన పక్షపాతం చూపని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు.
“నా దేవా నా దేవా, నా ముఖం నీ వైపు ఎత్తి చూపలేక సిగ్గుతో కృంగిపోయి ఉన్నాను. మా దోషాలు మా తలల కంటే పైగా పెరిగిపోయాయి, మా నేరాలు ఆకాశమంత ఎత్తుగా పెరిగిపోయాయి.
యెహోవా, ఇశ్రాయేలు దేవా, నువ్వు నీతిపరుడివి. కాబట్టి ఈనాటి వరకూ మిగిలిన మేము కొద్దిమందిమే. ఇదిగో, మేము నీ సన్నిధిలో అపరాధులం. నీ సన్నిధిలో నిలబడడానికి ఎవ్వరికీ అర్హత లేదు.”
పరిహాసం, అవమానం చేసే వాళ్ళ కారణంగా, పగ తీర్చుకునే శత్రువు కారణంగా
నా రక్షణకు ఆధారమైన దేవా, రక్తాన్ని చిందించినందుకు నన్ను క్షమించు. నీ నీతిన్యాయాలను బట్టి నేను ఆనందంతో బిగ్గరగా గానం చేస్తాను.
ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు.
దొంగ దొరికిపోయినప్పుడు సిగ్గుపడే విధంగా ఇశ్రాయేలు కుటుంబం సిగ్గుపడుతుంది. చెట్టుతో “నువ్వు మా తండ్రివి” అనీ, రాయితో “నువ్వే నన్ను పుట్టించావు” అనీ చెబుతూ, ఇశ్రాయేలు ప్రజలు, వారి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అవమానం పొందుతారు.
యూదా నా మీద తిరుగుబాటు చేసింది కాబట్టి వారు పొలాన్ని కావలి కాసేవారిలాగా యూదాను కూడా ముట్టడిస్తారు. ఇదే యెహోవా వాక్కు.
యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు. అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను. దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు?
ఈ పట్టణాన్ని కట్టిన రోజు నుంచి, ఇది నా ఉగ్రతను, నా కోపాన్ని రేకెత్తిస్తూనే ఉంది. ఈ రోజు వరకూ అది జరుగుతూనే ఉంది. కాబట్టి నేను నా ఎదుట నుంచి దాన్ని తొలగిస్తాను.
నువ్వు చేసిన వాటన్నిటి కోసం నేను ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దాన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడి, నోరు మూసుకుంటావు.” ఇదే ప్రభువైన యెహోవా ప్రకటన.
¶ ప్రభూ, నీకు విరోధంగా పాపం చేసినందున మాకు, మా రాజులకు, మా అధికారులకు, మా పూర్వీకులకు ముఖం చిన్నబోయేలా సిగ్గే తగినది.
¶ “చూడండి. నేనొక ఆజ్ఞ ఇస్తాను. ఒకడు ధాన్యాన్ని జల్లెడలో పోసి ఒక్క గింజ కూడా కింద పడకుండా జల్లించినట్టు, ఇశ్రాయేలీయులను అన్ని రాజ్యాల మధ్యకు జల్లిస్తాను.
ఆ రోజుల్లో ఆకాశం కింద ఉన్న ప్రతి ప్రాంతపు జనంలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో నివసిస్తున్నారు.