TSK

TSK · ప్రసంగి 5:8

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

యెరూషలేమును నాశనం చెయ్యడానికి దేవుడు ఒక దూతను పంపాడు. అతడు నాశనం చెయ్యబోతున్నప్పుడు యెహోవా చూసి, ఆ కీడు విషయంలో బాధపడి, నాశనం చేసే దూతతో “చాలు, ఇప్పుడు నీ చెయ్యి వెనక్కి తీసుకో” అని చెప్పగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గర నిలబడ్డాడు.

వాళ్ళు దరిద్రులపై దాడులు చేసి విడిచిపెట్టినవాళ్ళు. తమవి కాని ఇళ్ళను బలవంతంగా ఆక్రమించుకుంటారు. ఆ ఇళ్ళను కట్టి పూర్తి చేయరు.

దేవుడు అతణ్ణి కొట్టివేసేటప్పుడు, వాడి ప్రాణం తీసేసేటప్పుడు భక్తిహీనుడికి ఆధారమేది?

పేదలకు విరోధంగా జరుగుతున్న హింస కారణంగా, అవసరతలో ఉన్నవాళ్ళ మూలుగుల కారణంగా నేను లేచి వస్తాను, అని యెహోవా అంటున్నాడు. వాళ్ళు ఎదురు చూస్తున్న ఆ రక్షణ నేను వాళ్లకు అందిస్తాను.

వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు. ఆ దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు.

యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు.

దూషకులకు భూమి మీద భద్రత లేకుండా పోవాలి. దుర్మార్గులను ఆపదలు వెంటాడి పడగొట్టాలి.

¶ అంతేగాక ఈ లోకంలో న్యాయతీర్పు జరిగించే స్థలాల్లో, నీతి ఉండాల్సిన స్థలాల్లో నాకు దుష్టత్వం కనిపించింది.

నా ప్రజలను నలగ్గొట్టి, వాళ్ళ ముఖాలు మీరెందుకు నేల రాస్తున్నారు?” అని ప్రభువూ, సేనలకు అధిపతీ అయిన యెహోవా అంటున్నాడు.

అష్షూరీయులకు బాధ, వాళ్ళు నా కోపానికి సాధనమైన గద. నా ఉగ్రతను తీర్చుకునే దుడ్డు కర్ర.

¶ అప్పుడు యెహోవా దూత వెళ్ళి అష్షూరువారి సైనిక పటాలంలో 1, 85,000 మందిని హతమార్చాడు. ఉదయాన్నే ప్రజలు చూసినప్పుడు వారంతా శవాలుగా పడి ఉన్నారు.

ఎందుకంటే, మహా ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి అయినవాడు ఇలా చెబుతున్నాడు. “నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉన్నాను. అయినా, వినయంగల వారితో నలిగిన వారితో కూడా ఉంటాను. వినయం గలవారి ప్రాణాన్ని సేదదీర్చడానికీ నలిగినవారి ప్రాణాన్ని తెప్పరిల్లజేయడానికీ నేనున్నాను.

అయితే అక్రమ సంపాదనపై, నిర్దోషుల రక్తం ఒలికించడంపై, దుర్మార్గం చేయడంపై, ఇతరులను అణగదొక్కడంపై నీ దృష్టి, మనసూ ఉంది.

మీ నేరాలెన్నో నాకు తెలుసు. మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని తప్పుచేయని వారిని బాధిస్తారు. ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.

¶ గుర్రాలు బండల మీద పరుగెత్తుతాయా? అలాంటి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుతారా? అయితే మీరు న్యాయాన్ని విషతుల్యం చేశారు.

¶ మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ దుర్మార్గాలు చేసేవారికి బాధ తప్పదు. వాళ్లకు అధికారముంది కాబట్టి పగటి వెలుతురులో వాళ్ళు అలా చేస్తారు.

¶ నేనిలా చెప్పాను. “యాకోబు నాయకులారా, ఇశ్రాయేలీయుల అధికారులారా, ఇప్పుడు వినండి. న్యాయం అంటే ఏంటో మీరు తెలుసుకోవద్దా?

దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది. అసహ్యకరమైన తప్పుడు తూకాలున్నాయి.

¶ యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నువ్వున్న వాడవు కావా? మేము మరణించము. యెహోవా, తీర్పుకే నువ్వు వారిని నియమించావు. ఆశ్రయ దుర్గమా, మమ్మల్ని దండించడానికే వారిని పుట్టించావు.

¶ సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే ఆ దినాల్లో మిగిలి ఉన్న ప్రజలకు ఇది ఆశ్చర్యంగా ఉన్నా నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుందా? ఇదే యెహోవా వాక్కు.

‹మనుష్యకుమారుడు తన దూతలను పంపుతాడు. వారాయన రాజ్యంలో నుండి పాపానికి కారణమయ్యే ప్రతి దానినీ దుర్మార్గం చేసే వారందరినీ సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు.›

ఆ దూత, “పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తాడు. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొంటుంది. అందువల్ల పుట్టబోయే పవిత్ర శిశువును దేవుని కుమారుడు అంటారు.

¶ ఏవి జరగాలని నీవు సంకల్పించి ముందుగానే నిర్ణయించావో, వాటన్నిటినీ చేయడానికి నీవు అభిషేకించిన నీ పవిత్ర సేవకుడైన యేసుకు విరోధంగా

అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.

కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది.

¶ ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.

¶ ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తాన్నీ, యేసు హతసాక్షుల రక్తాన్నీ తాగి మత్తెక్కి ఉండడం చూశాను. అది చూసి నేను ఆశ్చర్యపోయాను.