అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు.
TSK
TSK · ఆది 34:7
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
“నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విషయాల్లో దేనినైనా పొరపాటున ఎవరైనా చేస్తే, మీరిలా చేయండి.
¶ సామాన్య ప్రజల్లో ఎవరైనా ఒకరు పాపం చేయాలనే ఉద్దేశం లేకుండా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిని పాపం చేయాలని కాకుండా పొరపాటున చేస్తే దోషి అవుతాడు.
¶ ఇశ్రాయేలు కుమార్తెల్లో ఎవరూ వేశ్యలుగా ఉండకూడదు. ఇశ్రాయేలు కుమారుల్లో ఎవరూ పురుష సంపర్కులుగా ఉండకూడదు.
వాళ్ళు ఆ విధంగా ఆనందిస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న కొందరు దుర్మార్గులు ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపు కొట్టారు. ఆ ఇంటి యజమాని అయిన ఆ వృద్దునితో మాట్లాడారు. “నీ ఇంటికి వచ్చిన వ్యక్తిని బయటకు తీసుకు రా. అతణ్ణి మేము తెల్సుకోవాలి” అన్నారు.
వాళ్ళు నా ఉంపుడుగత్తెను మానభంగం చేశారు. ఆమె చనిపోయింది. ఇశ్రాయేలీయుల్లో ఇలాంటి దుర్మార్గం, దౌర్జన్యం వాళ్ళు జరిగించారు కాబట్టి నేను ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దేశమంతటికి ఆ ముక్కలను పంపాను.”
ఈ సంగతి రాజైన దావీదుకు తెలిసింది. అతడు తీవ్రమైన కోపం తెచ్చుకున్నాడు.
¶ జ్ఞానం లేని యువకుల మధ్య ఒక తెలివి తక్కువ యువకుడు నాకు కనబడ్డాడు.
వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు.
¶ కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి.
¶ వివాహం అందరూ గౌరవించేదిగా దాంపత్యం పవిత్రంగా ఉండనివ్వండి. లైంగిక అవినీతిపరులనూ, వ్యభిచారులనూ దేవుడు శిక్షిస్తాడు.
¶ చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.