నీ వెండి మలినమైపోయింది. నీ ద్రాక్షారసం నీళ్లతో పలచబడి పోయింది.
TSK
TSK · యెషయా 1:25
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ “ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా,
కపటం మధ్యలో నువ్వు నివసిస్తున్నావు. వారి కపటంలో వారు నన్ను తెలుసుకోలేక పోతున్నారు. ఇదే యెహోవా వాక్కు.
నా మీద తిరుగుబాటు చేసేవాళ్ళనూ, దోషం చేసేవాళ్ళనూ, మీలో ఉండకుండాా ప్రక్షాళన చేస్తాను. వారు కాపురమున్న దేశంలో నుంచి వాళ్ళను రప్పిస్తాను గాని, నేను యెహోవానని మీరు తెలుసుకునేలా, వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు.”
కొలిమిలో వెండి కరిగినట్టు మీరు దానిలో కరిగిపోతారు, అప్పుడు యెహోవానైన నేను నా కోపం మీ మీద కుమ్మరించానని మీరు తెలుసుకుంటారు.”
¶ ఖడ్గమా, నా గొర్రెల కాపరి మీదా, నా సన్నిహితుడి మీదా పడు. గొర్రెలు చెదరిపోయేలా వాటి కాపరిని సంహరించు. బలహీనుల మీద నేను నా చెయ్యి ఉంచుతాను. ఇది యెహోవా వాక్కు.
¶ తూర్పారబట్టే చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళం బాగా శుభ్రం చేసి తన గోదుమలు గిడ్డంగిలో పోస్తాడు. పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు” అని చెప్పాడు.