“మీరు వెళ్లి, దొరికిన ఈ గ్రంథంలోని మాటలను గురించి నా విషయంలో, ప్రజల విషయంలో, యూదా వాళ్ళందరి విషయంలో, యెహోవాను అడగండి. మన పూర్వికులు తమ విషయంలో రాసి ఉన్న దానంతటి ప్రకారం చెయ్యకుండా ఈ గ్రంథపు మాటలు వినలేదు గనుక యెహోవా కోపాగ్ని మన మీద ఇంత ఎక్కువగా మండుతూ ఉంది” అన్నాడు.
TSK
TSK · యిర్మీయా 21:1
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు.
¶ అలాగే నివాసం ఏర్పరచుకున్న వాళ్ళలో అదాయా ఉన్నాడు. అదాయా యెరోహాము కొడుకు. యెరోహాము పషూరు కొడుకు. పసూరు మల్కీయా కొడుకు. ఇంకా అదీయేలు కొడుకు మశై కూడా ఉన్నాడు. అదీయేలు యహజేరా కొడుకు. యహజేరా మెషుల్లాము కొడుకు. మెషుల్లాము మెషిల్లేమీతు కొడుకు. మెషిల్లేమీతు ఇమ్మెరు కొడుకు.
¶ నిర్మాణ పని చేసినవాళ్ళ బంధువులు 822 మంది, పూర్వీకులైన మల్కీయా, పషూరు, జెకర్యా, అమీజు, పెలల్యాల క్రమంలో యెరోహాముకు పుట్టిన అదాయా.
¶ యూదా రాజైన సిద్కియా పాలన పదో సంవత్సరంలో, అంటే, నెబుకద్నెజరు ఏలుబడి 18 వ సంవత్సరంలో యెహోవా దగ్గర నుంచి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.
¶ యెహోయాకీము కొడుకు కొన్యాకు బదులుగా బబులోనురాజు నెబుకద్నెజరు యూదా దేశంలో రాజుగా నియమించిన యోషీయా కొడుకు సిద్కియా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు.
¶ “యెహోవా ఇలా అంటున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్న వాళ్ళు ఖడ్గంతో, కరువుతో, తెగులుతో చస్తారు. కాని కల్దీయుల దగ్గరికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు బతుకుతారు. అతడు తన జీవాన్ని ఒకడు కొల్లసొమ్ము దక్కించుకున్నట్టు దక్కించుకుంటాడు. ఎందుకంటే, అతడు బతుకుతాడు.”
¶ రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు.