అయితే యెహోవా మాకు దేవుడుగా ఉన్నాడు. మేము ఆయన్ని విసర్జించలేదు. యెహోవాకు సేవ చేసే యాజకులు అహరోను సంతతివారు. లేవీయులు చేయాల్సిన పనులు లేవీయులే చేస్తున్నారు.
TSK
TSK · యోవేలు 1:9
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ నియమించిన పండగలకు ఎవరూ రాలేదు గనక సీయోను దారులు సంతాపంతో ఉన్నాయి. పట్టణపు గుమ్మాలు ఒంటరివయ్యాయి. యాజకులు మూలుగుతున్నారు. దాని కన్యలు దుఃఖంతో ఉన్నారు. అది అమితమైన బాధతో ఉంది.
¶ యెహోవాకు ద్రాక్షారస పానార్పణం అర్పించరు. వారు అర్పించేవి ఆయనకి ఇష్టం లేదు. వారు ఆహారంగా పుచ్చుకొనేది ప్రలాపం చేసేవారి ఆహారం వలే ఉంటుంది. దాన్ని తినే వారంతా అపవిత్రులైపోతారు. వారి ఆహారం వారికే సరిపోతుంది. అది యెహోవా మందిరంలోకి రాదు.
మన కళ్ళముందే ఆహారం, మన దేవుని మందిరంలో సంతోషానందాలు నిలిచిపోలేదా?
¶ యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. “యెహోవా, నీ ప్రజలను కనికరించు. నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?”