TSK

TSK · విలాప వాక్యములు 2:16

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

ఆయన కళ్ళు నా మీద కోపంతో ఎర్రబడ్డాయి. నన్ను చూసి పళ్ళు కొరుకుతూ నా మీద పడి నాతో యుద్ధం చేశాడు.

గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు.

వాళ్ళు తమ మనస్సుల్లో ఆహా, మేము కోరుకున్నట్టే జరిగింది అని చెప్పే అవకాశం ఇవ్వకు. మేము వాణ్ణి పూర్తిగా నాశనం చేశాం, అని చెప్పనివ్వకు.

ఒక చెడ్డ రోగం వాణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు వాడు పడకపై ఉన్నాడు. దానిపైనుంచి వాడిక లేవడు అని చెప్పుకుంటారు.

ఆయన ఆకాశం నుండి సహాయం పంపి నన్ను రక్షిస్తాడు. నన్ను మింగివేయాలని చూసేవారు నాపై దూషణ మాటలు పలికినప్పుడు దేవుడు తన నిబంధన నమ్మకత్వంతో తన కృపాసత్యాలను పంపుతాడు. సెలా.

భక్తిహీనులు అది చూసి కోపం తెచ్చుకుంటారు. వారు పళ్ళు కొరుకుతూ క్షీణించి పోతారు. భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది.

నువ్వు పాడైపోయి నిర్జనంగా ఉన్నా నీ దేశం నాశనమైపోయినా ఇప్పుడు నీ నివాసులకు నీ భూమి ఇరుకుగా ఉంది. నిన్ను మింగివేసినవారు దూరంగా ఉంటారు.

వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారంతా వాళ్ళను మింగివేస్తూ వచ్చారు. వాళ్ళ శత్రువులు ‘మేం అపరాధులం కాము. ఎందుకంటే వీళ్ళు తమ నిజమైన నివాసం, తమ పూర్వీకులకు ఆధారం అయిన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు.’ అన్నారు.

యెరూషలేము ఇలా అంటుంది. ‘బబులోను రాజు నెబుకద్నెజరు నన్ను మింగి వేశాడు. నేను ఎండిపోయేలా చేశాడు. నన్ను ఖాళీ కుండగా చేశాడు. కొండ చిలవలాగా నన్ను మింగివేశాడు. నా ఆహారంతో తన కడుపు నింపుకున్నాడు. నన్ను ఖాళీ పాత్రలా చేశాడు.’”

ఆ గిన్నె చాలా పెద్దది, చాలా లోతైనది, గనుక నువ్వు ఒక ఎగతాళిగానూ, పరిహాసంగానూ ఔతావు.

¶ ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయుల బాధ చూసి మీరు చప్పట్లు కొట్టి, కాళ్లతో కదం తొక్కి, మీ మనస్సులోని తిరస్కారమంతటితో ఆనందించారు గనుక నేను యెహోవానని మీరు తెలుసుకునేలా,

అందుచేత ప్రవచించి ఇలా చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నలుదిక్కులా మీ శత్రువులు మిమ్మల్ని పట్టుకోవాలని చూస్తూ మిమ్మల్ని పాడుచేశారు. మీరు ఇతర రాజ్యాల వశమయ్యారు. మిమ్మల్ని ఎగతాళి చేసేవారికి చులకన అయ్యారు.

¶ నీ సోదరుని దినాన, అతని దురవస్థ దినాన నువ్వు ఆనందించవద్దు. యూదావారి నాశన దినాన వారి స్థితి చూసి సంతోషించ వద్దు. వారి ఆపద్దినాలో అతిశయించ వద్దు.

¶ మోయాబువారు వేసిన నింద, అమ్మోనువారు పలికిన దూషణ మాటలు నాకు వినబడ్డాయి. వారు నా ప్రజల సరిహద్దుల్లో ప్రవేశించి అహంకారంగా వారిని దూషించారు.