TSK

TSK · మలాకీ 3:11

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

నేను వారిని పూర్తిగా కొట్టివేస్తున్నాను. ఇక ద్రాక్షతీగెకు ద్రాక్షలు, అంజూరు చెట్టుకు అంజూరపండ్లు కాయవు. వాటి ఆకులు వాడిపోతాయి. నేను వారికి ఇచ్చినదంతా నశించిపోతుంది. ఇదే యెహోవా వాక్కు.

అతడు నా ద్రాక్షతోటను భయపెట్టేదిగా చేశాడు. నా అంజూరపు చెట్టును ఒలిచి వేశాడు. దాని బెరడు ఒలిచి పారేశాడు. వాటి కొమ్మలు తెల్లబారాయి.

ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. నేను గొప్ప పనులు చేస్తాను.”

విస్తారమైన మీ తోటలన్నిటినీ తెగుళ్ళతో నేను పాడు చేశాను. మీ ద్రాక్షతోటలనూ అంజూరపు చెట్లనీ ఒలీవచెట్లనూ మిడతలు తినేశాయి. అయినా మీరు నావైపు తిరగలేదు. యెహోవా ప్రకటించేది ఇదే.

¶ అంజూరపు చెట్లు పూత పట్టకపోయినా, ద్రాక్షచెట్లు ఫలింపక పోయినా, ఒలీవచెట్లు కాపులేక ఉన్నా, చేనులో పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, కొట్టంలో పశువులు లేకపోయినా,

¶ సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు కాపు కాస్తాయి. భూమి పంటలనిస్తుంది. ఆకాశం నుండి మంచు కురుస్తుంది. ఈ ప్రజల్లో శేషించిన వారికి వీటన్నిటిని నేను ఆస్తిగా ఇస్తాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు.