మీరు యెహోవా దృష్టికి దుర్మార్గం జరిగించి చేసిన మీ పాపాలను బట్టి ఆయనకు కోపం పుట్టించడం వలన, అన్నపానాలు మానివేసి మళ్ళీ నలభై పగళ్లు, నలభై రాత్రులు నేను యెహోవా సన్నిధిలో సాగిలపడి ఉన్నాను.
TSK
TSK · అపొస్తలుల కార్యములు 1:3
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ ఆ రాజుల కాలంలో పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతంగా నిలిచి ఉండే వేరే ఒక రాజ్యం నెలకొల్పుతాడు. ఆ రాజ్యాన్ని పొందిన వాళ్ళ చేతుల్లో నుంచి దాన్ని వేరే ఇంకెవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ తుత్తునియలు చేస్తుంది. అది శాశ్వతంగా నిలుస్తుంది.
నలభై రోజులు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకు ఆకలి వేసింది.
యేసు వారికి ఎదురు వచ్చి, ‹“మీకు శుభం!”› అని చెప్పాడు. వారు ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాదాలపై వాలి ఆయనను పూజించారు.
ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది.
¶ ఆదివారం తెల్లవారిన తరువాత ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరికి వచ్చారు.
¶ ఎనిమిది రోజులైన తరువాత మళ్ళీ ఆయన శిష్యులు లోపల ఉన్నారు. ఈసారి తోమా కూడా వారితో ఉన్నాడు. తలుపులు మూసి ఉన్నాయి. అప్పుడు యేసు వారి మధ్యకు వచ్చి, ‹“మీకు శాంతి కలుగు గాక!”› అన్నాడు.
యేసు చనిపోయి సజీవుడిగా లేచిన తరవాత శిష్యులకి ప్రత్యక్షం కావడం ఇది మూడోసారి.
ఏ ఆటంకమూ లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు.
ఆయన కేఫాకూ, తరువాత పన్నెండు మందికీ కనబడ్డాడు.
తండ్రి తన పిల్లలతో వ్యవహరించే విధంగా మేము మీ పట్ల వ్యవహరించామని మీకు తెలుసు.