¶ నేను ఆ రాత్రి వేళ ఐగుప్తు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుషుల్లో, జంతువుల్లో మొదటి సంతానం మొత్తాన్ని చంపివేస్తాను. ఐగుప్తు దేవుళ్ళ విషయంలో తీర్పు తీరుస్తాను. నేను యెహోవాను.
TSK
TSK · దానియేలు 11:8
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
వారి హోమపీఠాలను కూలదోసి, వారి విగ్రహాలను పగలగొట్టాలి. వారి దేవతా స్తంభాలను అగ్నితో కాల్చివేసి, వారి దేవుళ్ళ ప్రతిమలను కూల్చి వెయ్యాలి. ఆ స్థలం లో వాటి పేర్లు కూడా లేకుండా నాశనం చేయాలి.
ఫిలిష్తీయులు తమ దేవుళ్ళ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. దావీదు, అతని మనుషులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైనవారు కారు. చెక్కతో రాళ్ళతో మనుషులు చేసిన వారు కనుక అష్షూరు రాజులు వారిని నిర్మూలం చేశారు.
అప్పుడు నేను ఐగుప్తు దేవుళ్ళ గుళ్లలో అగ్ని రాజేస్తాను. నెబుకద్నెజరు వాటిని కాల్చి వేస్తాడు. లేదా ఆ దేవుళ్ళను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పురుగులను తుడిచి పెట్టినట్టుగా అతడు ఐగుప్తు దేశాన్ని తుడిచి పెట్టేస్తాడు. విజయం సాధించి అక్కడ నుండి వెళ్తాడు.
యెహోవా యూదా రాజు యెహోయాకీముపై విజయం ఇచ్చాడు. అతడు దేవుని మందిరంలోని పవిత్ర ఉపకరణాలను అతనికి అప్పగించాడు. అతడు ఆ వస్తువులన్నిటినీ బబులోను దేశానికి తన దేవుడి ఆలయానికి తీసుకువెళ్ళి ఆ పవిత్ర ఉపకరణాలను తన దేవుడి ఖజానాలో ఉంచాడు.
¶ ఈ విగ్రహం ఇశ్రాయేలువారి చేతి పనే గదా? కంసాలి దాన్ని తయారు చేశాడు. అది దేవుడు కాదు. షోమ్రోను దూడ ముక్కలు చెక్కలైపోతుంది.
¶ ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా, తూర్పు గాలి వస్తుంది. యెహోవా పుట్టించే గాలి అరణ్యంలో నుండి లేస్తుంది. అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోతాయి. ఎఫ్రాయిము ఊటలు ఇంకిపోతాయి. అతని బావిలో నీరు ఉండదు. అతని శత్రువులు అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటిని కొల్లగొడతారు.