TSK

TSK · హెబ్రీ పత్రిక 11:38

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

¶ దావీదు అక్కడనుండి తప్పించుకుని బయలుదేరి అదుల్లాము గుహలోకి వెళితే, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివాళ్ళంతా ఆ సంగతి విని అతని దగ్గరికి వచ్చారు.

¶ జీఫీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు దగ్గరికి వచ్చి “యెషీమోనుకు దక్షిణ దిక్కులో ఉన్న హకీలా అడవిలోని కొండ స్థలాల్లో మా ప్రాంతంలో దావీదు దాక్కుని ఉన్నాడు.

¶ సౌలు ఫిలిష్తీయులను తరమడం మానుకుని తిరిగి వెళ్ళాక, దావీదు ఏన్గెదీ అరణ్య ప్రాంతంలో ఉన్నాడని అతనికి కబురు వచ్చింది.

కాబట్టి నీవు లేచి నీ ఇంటికి వెళ్ళు, నీవు పట్టణంలో అడుగుపెట్టగానే నీ బిడ్డ చనిపోతాడు.

యెజెబెలు యెహోవా ప్రవక్తలను చంపేస్తూ ఉన్నప్పుడు గుహకు యాభై మంది చొప్పున రెండు గుహల్లో వంద మందిని దాచి, అన్నపానాలు ఇచ్చి వారిని పోషించాడు.

¶ అక్కడున్న ఒక గుహలో ఉండిపోయాడు. యెహోవా “ఏలీయా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్” అని అతనిని అడిగాడు.

నేను గొంతెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను.