దేవుడు మనుషులను అన్ని రకాల బాధలతో కష్టపెట్టాడు కాబట్టి రాజ్యం రాజ్యానికీ పట్టణం పట్టణానికీ వ్యతిరేకంగా లేచి ముక్కలు చెక్కలై పోయాయి.
TSK
TSK · మార్కు 13:8
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
“నేను ఐగుప్తు ప్రజలకు వ్యతిరేకంగా ఐగుప్తు ప్రజలను రేపుతాను. సోదరుడికి వ్యతిరేకంగా సోదరుడూ, పొరుగువాడికి వ్యతిరేకంగా పొరుగువాడూ పోరాటం చేస్తారు. పట్టణంతో పట్టణం, రాజ్యంతో రాజ్యం యుద్ధం చేస్తాయి.
స్త్రీ పురిటినొప్పులతో కేకలు వేస్తున్నట్టు, తొలి కాన్పులో స్త్రీ కేకలు వేస్తున్నట్టు సీయోను కన్య “అయ్యో, నాకు బాధ! నా హంతకుల చేతిలో చిక్కి నేను మూర్చబోతున్నాను” అని ఎగశ్వాసతో చేతులు చాస్తూ వేస్తున్న కేకలు నాకు వినబడుతున్నాయి.
వారిని నీకై నువ్వు స్నేహితులుగా చేసికొన్నావు. ఇప్పుడు వారినే ఆయన నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేం చేస్తావు? ప్రసవించే స్త్రీ పడే వేదన నీకు కలుగుతుంది కదా?
సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. “ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి విపత్తు వ్యాపిస్తూ ఉంది. భూదిగంతాల నుంచి గొప్ప తుఫాను బయలుదేరుతూ ఉంది.
బబులోను రాజు వాళ్ళను గూర్చిన సమాచారం విన్నాడు. భయంతో అతని చేతులు చచ్చుబడి పోయాయి. ప్రసవించ బోయే స్త్రీకి కలిగే వేదన లాంటిది అతనికి కలిగింది.
¶ రాజ్యాల సింహాసనాలను నేను కింద పడదోస్తాను. అన్యజనుల రాజ్యాలకున్న బలాన్ని నాశనం చేస్తాను. రథాలను, వాటిని ఎక్కిన వారిని కింద పడేస్తాను. గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గం చేత ఒకరు కూలి పోతారు.
‹ఇవన్నీ కష్టాలకు ఆరంభం మాత్రమే.›
ప్రజలు “అంతా ప్రశాంతంగా భద్రంగా ఉంది. భయమేమీ లేదు,” అని చెప్పుకుంటూ ఉన్నప్పుడు గర్భవతికి నొప్పులు వచ్చినట్టుగా వారి మీదికి నాశనం అకస్మాత్తుగా వస్తుంది కనుక వారు ఏ విధంగానూ తప్పించుకోలేరు.