TSK

TSK · సామెత 20:1

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ఆ ద్రాక్షారసం తాగి మత్తెక్కి తన గుడారంలో బట్టలు లేకుండా పడి ఉన్నాడు.

ఆ రాత్రి వాళ్ళు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించారు. ఆ తరువాత అతని పెద్ద కూతురు లోపలికి వెళ్ళి తన తండ్రితో శారీరక సంబంధం పెట్టుకుంది. కాని ఆమె ఎప్పుడు తన పక్కన పడుకుందో, ఎప్పుడు లేచి వెళ్లిందో అతనికి తెలియలేదు.

ఈలోగా దావీదు ఊరియాను భోజనానికి పిలిపించాడు. దావీదు అతడు బాగా తిని, తాగి మత్తుడయ్యేలా చేశాడు. సాయంత్రమయ్యాక అతడు బయలుదేరి వెళ్లి మళ్ళీ తన ఇంటికి వెళ్ళకుండా రాజు సేవకుల మధ్య నిద్రపోయాడు.

¶ వాళ్ళు మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళారు. బెన్హదదు, ఆ 32 మంది తోటిరాజులూ గుడారాల్లో తాగి మత్తుగా ఉన్నారు.

¶ ఎవరికి హింస? ఎవరికి దుఃఖం? ఎవరికి జగడాలు? ఎవరికి ఫిర్యాదులు? ఎవరికి అనవసరమైన గాయాలు? ఎవరికి ఎరుపెక్కిన కళ్ళు?

¶ ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు.

ద్రాక్షారసం తాగడంలో పేరు తెచ్చుకున్న వారికి, మద్యం కలపడంలో చాతుర్యం గల వారికి బాధ.

వాళ్ళిలా అంటారు “రండి. ద్రాక్షమద్యం, మత్తిచ్చే పానీయాలు తాగుదాం. రేపు ఇవాళ లాగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది.”

¶ మన రాజు ఉత్సవ దినాన అధికారులు అతని ద్రాక్షారసం కాకతో మత్తెక్కి జబ్బుపడిపోయారు. రాజు తానే అపహాసకులతో చెయ్యి కలిపాడు.

దొంగలూ, దురాశ పరులూ, తాగుబోతులూ, దుర్భాషలాడే వారూ, దోపిడీదారులూ దేవుని రాజ్యానికి వారసులు కాలేరు.

మద్యం సేవించి మత్తులో మునిగిపోకండి. అది విపరీత ప్రవర్తనకు దారి తీస్తుంది. అయితే పరిశుద్ధాత్మతో నిండి ఉండండి.