TSK

TSK · ఆది 10:2

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

¶ యాపెతు కొడుకులు వీళ్ళు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు.

నీకు జెండాలుగా ఉండడానికి నీ తెరచాపలు ఐగుప్తులో తయారై బుట్టా వేసిన శ్రేష్ఠమైన నారతో చేశారు!

యావాను, తుబాలు, మెషెకు ప్రాంతాలవాళ్ళు నీతో వ్యాపారం చేశారు. బానిసలనూ ఇత్తడి వస్తువులనూ ఇచ్చి నీ సరకులు కొన్నారు.

నరపుత్రుడా, మాగోగు దేశపువాడైన గోగు, అంటే, రోషు, మెషెకు, తుబాలు రాజ్యాల పాలకుని వైపు తిరిగి అతని గూర్చి ప్రవచించు.

దూరంగా ఉత్తర దిక్కునుండి నీవు, నీతోకూడ అనేకమంది ప్రజలు గుర్రాలెక్కి బహు విస్తారమైన సైన్యంతో వచ్చి

వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు.