TSK

TSK · 1 దిన 6:3

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

తిరిగి భాగానికి

పిల్లవాడికి ఏమైనా జరుగుతుందేమోనని వాడి అక్క దూరంగా నిలబడి చూస్తూ ఉంది.

¶ అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోను, మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు.

అహరోను సోదరి, ప్రవక్త్రి మిర్యాము తంబుర వాయిస్తూ బయలుదేరింది. స్త్రీలంతా తంబురలు వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆమెను వెంబడించారు.

¶ “నాకు యాజకత్వం చేయడానికి నీ సోదరుడు అహరోనును అతని కొడుకులు నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల్లో నుండి నీ దగ్గరికి పిలిపించు.

¶ అప్పుడు మోషే అహరోనుతోనూ, మిగిలి ఉన్న అతని కొడుకులు ఎలియాజరు ఈతామారులతోనూ మాట్లాడాడు. “యెహోవాకు అర్పించిన దహనబలి నుండి మిగిలిన నైవేద్యాన్ని తీసుకుని పొంగజేసే పదార్ధం లేకుండా దాన్ని తినండి. ఎందుకంటే అది అతి పరిశుద్ధమైంది.

ఉజ్జీయేలు సంతతిలో వారి నాయకుడైన అమ్మీనాదాబును, అతని బంధువుల్లో నూట పన్నెండు మందిని దావీదు సమావేశపరిచాడు.

¶ అమ్రాము కొడుకులు అహరోను, మోషే. అహరోనునూ, అతని కొడుకులనూ నిత్యం అతి పరిశుద్ధ వస్తువులను ప్రతిష్ఠించడానికీ, యెహోవా సన్నిధిలో ధూపం వెయ్యడానికీ, ఆయన సేవ జరిగించడానికీ, ఆయన పేరునుబట్టి ప్రజలను దీవించడానికీ ప్రత్యేకించారు.

ఇస్హారీయుల్లో షెలోమోతు, షెలోమోతు సంతానంలో యహతు,