ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలతో మరింత కష్టమైన పనులు చేయించుకున్నారు.
TSK
TSK · యెషయా 52:5
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ యెహోవా ఇలా చెప్పాడు. “ఐగుప్తులో ఉంటున్న నా ప్రజలు పడుతున్న బాధలు నాకు తెలుసు. కఠినమైన పనులు చేయిస్తూ వారిని బాధపెడుతున్న వారిని బట్టి వారు పెడుతున్న మొర నేను విన్నాను. వారి దుఃఖం నాకు తెలుసు.
అతి తక్కువ వెలకు మమ్మల్ని అమ్మివేశావు. అలా చేయడం మూలంగా నీ సంపద ఏమీ అధికం కాలేదు.
దేవా, శత్రువులు ఎంతకాలం నిన్ను నిందిస్తారు? శత్రువులు నీ నామాన్ని ఎల్లకాలం దూషిస్తారా?
దేవా, లేచి నీ ఘనతను కాపాడుకో. బుద్ధిహీనులు రోజంతా నిన్ను దూషిస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో.
“ఇక్కడ నీకేం పని? ఇక్కడ సమాధి తొలిపించుకోడానికి అసలు నువ్వెవరు? ఎత్తయిన స్థలంలో సమాధిని తొలిపించుకుంటున్నావు. రాతిలో నీ కోసం నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు!
¶ నువ్వు కూర్చోవడం, బయటికి వెళ్ళడం, లోపలి రావడం, నా మీద రంకెలు వేయడం నాకు తెలుసు.
నీ కొడుకులు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుపడినట్టు, ప్రతి వీధిలో పడియున్నారు. యెహోవా కోపంతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.
యెహోవా ఇలా చెబుతున్నాడు “మిమ్మల్ని ఉచితంగా అమ్మేశారు గదా! ఉచితంగానే మీకు విమోచన వస్తుంది.”
¶ నా మూలుగు విను. నన్ను ఆదరించేవాడు ఒక్కడూ లేదు. నువ్వు నాకు కష్టం కలిగించావన్న వార్త నా శత్రువులు విని సంతోషంగా ఉన్నారు. నువ్వు ప్రకటించిన ఆ రోజు రప్పించు, అప్పుడు వాళ్ళకు కూడా నాకు జరిగినట్టే జరుగుతుంది.
¶ బలమైన యువకులను గానుగల దగ్గరికి తీసుకొచ్చారు. యువకులు కొయ్య దుంగలు మొయ్యలేక తూలిపడ్డారు.
కాని నేను వాళ్ళను రప్పించినప్పుడు ఏ అన్యప్రజలు చూశారో, ఏ అన్యప్రజల్లోనుంచి నేను వాళ్ళను రప్పించానో, వాళ్ళ ఎదుట నా పేరుకు దూషణ కలగకుండా ఉండేలా నేను అనుకున్న ప్రకారం చెయ్యకుండా మానాను.
¶ ఆ రోజున చేప ద్వారంలో రోదన ధ్వని, పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది. ఇదే యెహోవా వాక్కు.