నెహెమ్యా 3:15
TSK
¶ ఆ తరువాత మిస్పా ప్రదేశానికి అధికారియైన కొల్హోజె కొడుకు షల్లూము ఊట ద్వారాన్ని తిరిగి కట్టి, దానికి పైకప్పు పెట్టి, తలుపులు నిలబెట్టారు, తాళాలు, గడులు అమర్చాడు. ఇంతేకాక, దావీదు నగరు నుండి దిగువకు వెళ్ళే మెట్ల దాకా రాజు తోటలో ఉన్న సిలోయము వాగు గోడ కూడా కట్టాడు.