TSK

TSK · యెహెజ్కేలు 39:21

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

మాంత్రికులు “ఇది దేవుడైన యెహోవా వేలు” అని ఫరోతో చెప్పారు. అయినప్పటికీ యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినం కావడం వల్ల అతడు వారి మాట వినలేదు.

నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాను. అతడు వాళ్ళను తరుముతాడు. నేను ఫరో ద్వారా, మిగిలిన అతని సేన ద్వారా మహిమ పొందుతాను. నేను యెహోవాను అని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.”

¶ అప్పుడు ప్రజలు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన ప్రజలను చంపకుండా ఉండేలా దాన్ని దాని స్వస్థలానికి పంపించండి” అని చెప్పారు. దేవుని హస్తం శిక్ష అక్కడ ఎంతో భారంగా ఉంది. అందువల్ల మరణ భయం ఆ పట్టణం వారందరినీ అల్లకల్లోలం చేసింది.

పగలూ రాత్రీ నా మీద నీ చెయ్యి భారంగా ఉంది. వేసవిలో దుర్భిక్షంలా నా శక్తి అంతా హరించుకు పోయింది. సెలా.

యెహోవా, నువ్వు నీ చేతిని ఎత్తావు. కానీ వాళ్ళది గమనించలేదు. కానీ వాళ్ళు ప్రజల కొరకైన నీ ఆసక్తిని చూస్తారు. అప్పుడు వాళ్లకి అవమానం కలుగుతుంది. ఎందుకంటే నీ శత్రువుల కోసం మండే అగ్ని వాళ్ళని దహించి వేస్తుంది.

మీ మూలంగా ఇతర రాజ్యాల్లో దూషణకు గురి అయిన నా గొప్ప పేరు ఎంత పవిత్రమో నేను చూపిస్తాను. నేను పరిశుద్దునిగా మీరు నన్ను చూసినప్పుడు నేను యెహోవా ప్రభువునని వారు తెలుసుకుంటారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

అన్యజనాలంతా నేను యెహోవానని తెలుసుకునేలా నేను నా గొప్పతనాన్ని, పరిశుద్ధతను వారి ఎదుట చూపించి నన్ను నేను హెచ్చించుకుంటాను.

కళ్ళారా దాన్ని చూసిన మీరు “ఇశ్రాయేలు ప్రజల సరిహద్దుల అవతల కూడా యెహోవా గొప్పవాడు” అంటారు.