అప్పుడు లేవీయులైన యాజకులు లేచి ప్రజలను దీవిస్తే వారి మాటలు వినబడ్డాయి. వారి ప్రార్థన దేవుడు ఉండే పరిశుద్ధ స్థలం, అంటే పరలోకానికి చేరింది.
TSK
TSK · యోనా 2:7
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
నా బాధలో నేను యెహోవాకు మొరపెట్టాను. నాకు సహాయం చెయ్యమని దేవునికి ప్రార్థన చేశాను. ఆయన తన ఆలయంలోనుంచి నా స్వరం విన్నాడు, నా నివేదన ఆయన సన్నిధిలో ఆయన చెవిన పడింది.
నన్ను నీళ్ళలా పారబోస్తున్నారు. నా ఎముకలన్నీ స్థానం తప్పాయి. నా హృదయం మైనంలా ఉంది. నా అంతర్భాగాల్లో అది కరిగిపోతూ ఉంది.
నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? అంతరంగంలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయన్ని స్తుతిస్తాను.
నా ప్రాణమా, నువ్వు ఎందుకు నిరుత్సాహంగా ఉన్నావు? నీలో నువ్వు ఎందుకు ఆందోళన పడుతున్నావు? దేవునిలో నమ్మకం ఉంచు. నా సహాయం, నా దేవుడూ అయిన ఆయన్ని నేను స్తుతిస్తాను.
ఇది నా బాధ. మా పట్ల సర్వశక్తుని కుడి చెయ్యి మారుతూ ఉంది, అని నేనన్నాను.
పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాను. నీ పనులన్నీ మననం చేసుకుంటున్నాను. నువ్వు సాధించిన వాటిని తలపోసుకుంటున్నాను.
మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వాడెవడు? వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి.
నీ సన్నిధినుంచి నన్ను తరిమి వేసినా, నీ పరిశుద్ధాలయం వైపు మళ్ళీ చూస్తాను అనుకున్నాను.
¶ అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. లోకమంతా ఆయన సన్నిధిలో మౌనంగా ఉండు గాక.
¶ మీరు అలసి పోకుండా, సొమ్మసిల్లి పోకుండా ఉండడానికి పాపులు తనకు వ్యతిరేకంగా పలికిన మాటలను సహించిన ఆయనను గూర్చి ఆలోచించండి.